సూర్య కథానాయకుడిగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో సూర్యను ఒక డీసెంట్ మిడిల్ ఏజ్ జెంటిల్మెన్గా చూపిస్తూ, ఆయనలోని ‘వింటేజ్’ మ్యాజిక్‌ను వెంకీ అట్లూరి మళ్లీ వెండితెరపైకి తెచ్చాడు. ఈ టీజర్లో సూర్య లుక్, ఆయన పాత్రలోని హుందాతనం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా ఈ టీజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. దాదాపు 1.3 మిలియన్ అకౌంట్లు ఈ టీజర్‌ను షేర్ చేయడం గమనార్హం. ఇటీవల కాలంలో ఒక తమిళ చిత్ర టీజర్‌కు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సూర్య-వెంకీ అట్లూరి కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్‌కు ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఈ చిత్రంలో మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ స్టార్స్ రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూలై 2026లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతోంది.
