ఓటీటీలో దుమ్ములేపుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్.. ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్..!

Vishwanath & Sons

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలోనూ సంచలనం సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో ఈ చిత్రం ట్రెండింగ్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో నెటిజన్ల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో మెరిశారు.

జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నిమిష్ రవి విజువల్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్స్‌గా నిలిచాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్ వైడ్‌గా అత్యధిక వ్యూస్‌ సాధిస్తూ దూసుకుపోతోంది.

Exit mobile version