ఈ భారీ సీక్వెల్ వాయిదా పడనుంది ?

Published on Aug 8, 2018 4:22 pm IST

లోక నాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘విశ్వరూపం 2’. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం ప్రస్తుతం విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు రాజకీయ దిగ్గజం మహోన్నత నేత కరుణానిధి మరణం కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని కమల్‌ భావిస్తున్నారట. అయితే ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయొచ్చు అని తెలుస్తోంది.

కాగా కమల్ కరుణానిధిగారికి నివాళులర్పించిన తర్వాత ఎమోషనలై మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ వంటివారు నటిస్తోన్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు. 2013లో వచ్చిన ‘వివస్వరూపం’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. ఈ సీక్వెల్ కోసం కమల్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More