
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం తను స్వీయ దర్శకత్వంలో నటించిన ‘విశ్వరూపం 2’ చిత్ర ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. దాంట్లో భాగంగా జరిగిన ఓక ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి కమల్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
హాలీవుడ్ తరహాలో తెరకెక్కిన ఈచిత్రంలో ఆయన స్పై ఏజెంట్ గా నటించానని ఈసినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని ఆయన అన్నారు.అలాగే హాలీవుడ్ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకొనే ఈ చిత్రాన్ని తెరకెక్కించానని కమల్ వెల్లడించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మితమైన ఈ చిత్రంలో పూజా కుమార్ , ఆండ్రియాలు ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో ఈచిత్రం ఆగష్టు 10న విడుదలకానుంది.