విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం.

విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం.

Published on Sep 14, 2019 7:13 PM IST

విశ్వక్ సేన్ ఇటీవల ఫలక్ నుమా దాస్ గా ప్రేక్షకులను అలరించారు. ఉరమాస్ తెలంగాణా పోరగాడి పాత్రలో విశ్వక్ అభిమానులను బాగానే ఆకట్టుకున్నాడు. కాగా ఈ యంగ్ హీరో తన తదుపరి చిత్రం పట్టాలెక్కించే పనిలో పడ్డారని సమాచారం. పాగల్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హుషారు చిత్రాన్ని నిర్మించిన బెక్కం వేణు గోపాల్ నిర్మించనున్నారట.

నూతన దర్శకుడు సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నిర్మిస్తుండగా ఈ ఏడాది డిసెంబర్ నుండి చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. ఇక ఫలక్ నుమా దాస్ చిత్రంలో పాత్రకి పూర్తి భిన్నంగా విశ్వక్ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ చిత్రం కొరకు పని చేసే మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు