ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఓరి దేవుడా”.!

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఓరి దేవుడా”.!

Published on Nov 11, 2022 8:00 AM IST

మాస్ కా దాస్ యంగ్ హీరో హీరో విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “ఓరి దేవుడా”. తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఈ చిత్రం తన ఒరిజినల్ చిత్రం “ఓహ్ మై కడవులే” కి రీమేక్ గా తెలుగులో తెరకెక్కింది. మరి తెలుగులో అయితే ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ కూడా అయ్యింది.

ఇక ఈ చిత్రం అయితే లేటెస్ట్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి. ఆహా లో ఈరోజు నుంచి అయితే అందుబాటులోకి వచ్చేసింది. మరి ముందు మిస్ అయ్యినటువంటి వారు అయితే ఈ చిత్రాన్ని ఈరోజు నుంచి ఆహా లో వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రంలో అయితే మన టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించగా పీవీపీ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు