సెన్సార్ పూర్తి చేసుకున్న ‘విశ్వరూపం-2’ !

17th, March 2018 - 01:37:53 PM

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విశ్వరూపం-2’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నారు. కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును అసలు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుండి పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న కమల్ అన్ని జాగ్రత్తలు తీసుకుని చివరి దశకు చేర్చారు. ఇటీవలే ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది.

త్వరలో ట్రైలర్ ను కూడ రిలీజ్ చేయనున్నారు. తమిళ కొత్త సంవత్సరం సందర్బంగా ఏప్రిల్ 13న చిత్రాన్ని విడుదలచేసే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. కమల్ నటించడడం, నిర్మించడమేగాక, డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ వంటివారు నటిస్తున్నారు