కొత్త రికార్డు సృష్టించిన విశ్వాసం !

కొత్త రికార్డు సృష్టించిన విశ్వాసం !

Published on Nov 26, 2018 10:53 AM IST

Viswasam11
తల అజిత్ నటించిన తాజా చిత్రం ‘విశ్వాసం’ కు క్రేజ్ మాములుగా లేదు. నిన్న ఈచిత్రం యొక్క మోషన్ పోస్టర్ విడుదలై యూ ట్యూబ్ లో ట్రేడింగ్ లో కొనసాగుతూ 2లక్షల 81వేల లైక్స్ ను సొతం చేసుకుంది. ఇప్పటివరకు ఇండియన్ మూవీస్ లో మోషన్ పోస్టర్ పరంగా అత్యదిక లైక్స్ రాబట్టిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. దీని తరువాత స్థానాల్లో పెట్టా (లక్షా 43 వేలు ) , థగ్స్ అఫ్ హిందుస్థాన్ (లక్షా 24 వేలు),సామి స్కోయర్ (లక్ష ),సైరా (84వేలు) చిత్రాలు ఉన్నాయి.

ఇక శివ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్ లో నటిస్తుండడంతో ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయన తార కథానాయికగా నటించగా ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు