విశ్వాసం బ్రేక్ ఈవెన్ కు చేరుకోగలదా ?

Viswaasam
తల అజిత్ నటించిన విశ్వాసం ఇటీవల విడుదలై కోలీవుడ్ లో కలెక్షన్ల పరంగా అల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈచిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలకానుంది. అజిత్ గత చిత్రం వివేగం ఇక్కడ డిజాస్టర్ కావడం అలాగే ఆయన కు తెలుగులో పెద్దగా మార్కెట్ కూడా లేకపోవడంతో ఈ విశ్వాసం ను తక్కువ రేట్లకే అమ్మారు. ఇక ఈచిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే వేరే సినిమాల నుండి పెద్దగా పోటీ లేకపోవడం అలాగే సుమారు 400 స్క్రీన్ లలో విడుదలవుతుండడం ఈ చిత్రానికి కలిసి రానుంది.

శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులో మార్చి 1న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం కన్నడ లో జగమల్ల అనే టైటిల్ తో విడుదలకానుంది.

Exit mobile version