విశ్వాసం స్టోరీ లైన్ రివీల్ !

Published on Jan 6, 2019 12:00 pm IST

తల అజిత్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వాసం’ విడుదలకు సిద్దమైంది. ఇక ఈ చిత్రం యొక్క స్టోరీ గురించి ఆసక్తికర సమాచారం వెలుబడింది. అజిత్ ,నయన తార ప్రేమలో ఎలా పడ్డారు అలాగే 12సంవత్సరాల తరువాత మళ్ళీ వారి ఇద్దరు ఎలా కలిశారు.. వారి కూతుర్ని ప్రతి నాయకుడు జగపతి బాబు నుండి ఎలా కాపాడుకున్నారు అనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది.

శివ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించింది. పొంగల్ కానుకగా జనవరి 10న విడుదలకానున్న ఈ చిత్రానికి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ‘వీరం , వేదలమ్ , వివేగం’ తరువాత అజిత్ -శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈచిత్రం బాక్సాఫిస్ వద్ద సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘పేట’ తో పోటీపడనుంది.

సంబంధిత సమాచారం :

X
More