హైదరాబాద్ లో ‘తమిళ్ స్టార్’ ఫిల్మ్ షూటింగ్ !

హైదరాబాద్ లో ‘తమిళ్ స్టార్’ ఫిల్మ్ షూటింగ్ !

Published on Oct 20, 2018 2:27 PM IST

Viswasam

తమిళంలో రజనీకాంత్ తర్వాత అంతటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న హీరో ‘అజిత్’. ఆయన సినిమా వస్తుందంటే తమిళ థియేటర్స్ అన్నీ కళకళలాడిపోతాయి. కాగా జె. శివ కుమార్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వాసం’. ఈ చిత్రంలోని ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ ని కూడా హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తోంది చిత్రబృందం. క్లైమాక్స్ లో అజిత్ తో పాటు, మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అజిత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు