విశ్వాసం తెలుగు వర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్అయినట్లే !

Published on Jan 20, 2019 1:00 am IST

తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ ఇటీవల పొంగల్ కానుకగా విడుదలై 125కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ ను ఫిబ్రవరి 1న విడుదలచేయనున్నారని సమాచారం. ఆసమయంలో టాలీవుడ్ నుండి వేరే చిత్రాలు విడుదలకాకపోవడంతో ఈచిత్రం విడుదలకు అదే డేట్ ను లాక్ చేశారట.

శివ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించగా జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రను పోషించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More