వివేక్ ఒబెరాయ్ సంచలన ట్వీట్.. అందులో ఐశ్వర్య కూడా !

Published on May 20, 2019 10:00 pm IST

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కామెడీ పండించడం కోసం చేసిన ఒక ట్వీట్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. ట్విట్టర్లో ఒక నెటిజన్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ఐశ్వర్యరాయ్, సల్మాన్, వివేక్ ఒబెరాయ్, అభిషేక్ బచ్చన్ ఉన్న ఫోటో ఒకదాన్ని క్రియేట్ చేశాడు. అందులో ఒపీనియన్ పోల్ అంటూ ఐశ్వర్య, సల్మాన్ జంటగా ఉండగా ఎగ్జిట్ పోల్ పేరుతో వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యల ప్రేమాయణాన్ని గుర్తుచేసే ఫోటో ఉంది. ఇక చివరగా ఫైనల్ రిజల్ట్ అంటూ ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, వారి కుమార్తె ఉన్న ఫోటోను పెట్టారు.

దీన్ని సరదాగానే తీసుకున్న ఒబెరాయ్ జనం కూడా అలాగే తీసుకుంటారులే అనే ఉద్దేశ్యంతో నో పాలిటిక్స్ జస్ట్ లైఫ్ అంటూ పోస్ట్ పెట్టి ఆ ఫోటోను ట్వీట్ చేశారు. నెటిజన్లు కొందరు దాన్ని చూసి నవ్వుకున్నా ఇంకొందరు మాత్రం పాత విషయాలను గుర్తుచేసి ఎందుకు సదరు వ్యక్తుల్ని డిస్టర్బ్ చేయడం, మీరింకా చిన్నపిల్లాడిలానే ఉన్నారు అంటూ విమరలు గుప్పించారు. ఇకపోతే ఆయన నటించిన ‘పిఎం నరేంద్ర మోడీ’ చిత్రం ఈ నెల 24న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More