కమల్ హాసన్‌కు కౌంటర్ ఇచ్చిన వివేక్ ఒబెరాయ్ !

Published on May 13, 2019 2:55 pm IST


రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత నటుడు కమల్ హాసన్ కొన్ని సందర్భాల్లో వివిధ అంశాల మీద, పరిస్థితుల మీద సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా కూడా తన పార్టీ తరపున తమిళనాడులోని అరవకురిచి నియోజకవర్గంలో మాట్లాడిన ఆయన మన దేశంలో మొదటి టెర్రరిస్ట్ హిందువుని, అతనే గాంధీని చంపిన నాథురామ్ గాడ్సే అని అన్నారు.

ఈ వ్యాఖ్యలను దేశావ్యాప్తంగా పలువురు ఖండిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ స్పందిస్తూ ‘కమల్ సర్.. మీరొక గొప్ప నటుడు. కళకు ఎలాగైతే మతం ఉండదో టెర్రరిజాన్ని కూడా మతం ఉండదు. మీరు గాడ్సే టెర్రరిస్ట్ అన్నారు. మళ్ళీ హిందువులను ఎందుకు ప్రస్తావనకు తెచ్చారు. ముస్లింల ఓట్లు పొందడం కోసమా. దేశాన్ని విడగొట్టకండి. అందరం ఒక్కటే’ అంటూ కౌంటర్ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :

More