రవితేజతో వినాయక్.. నిజమేనా ?

Published on Apr 14, 2019 10:57 pm IST

నందమూరి బాలకృష్ణ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోన్నప్పటికీ ఆ సినిమాకి స్క్రిప్ట్ మాత్రం సెట్ కావట్లేదు. కాగా తాజా సమాచారం ప్రకారం వినాయక్ తన కథను రవితేజకు వినిపించారని.. రవితేజకు కూడా కథ బాగా నచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి.

కాగా వీరి సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక గతంలో వీరి కాంబినేషన్ లో ‘కృష్ణ’ సూపర్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాతోనైనా వినాయక్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చిచూడాలి.

సంబంధిత సమాచారం :