వినాయక్ హీరోగా వస్తోన్న మూవీ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jun 16, 2019 10:30 pm IST

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫస్ట్ షెడ్యూల్ కి ఆ తరువాత జరగబోయే షెడ్యూల్ కి చాల రోజులు గ్యాప్ ఉంటుందట.

మొదటి షెడ్యూల్ లో షూట్ చేసే సన్నివేశాలకు వినాయక్ ఇప్పుడు ఉన్న ఫిజికే అవసరం అంట, అందుకే పది రోజులు జరగనున్న ఈ షెడ్యూల్ ను సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టనున్నారు.

కాగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో వినాయక్ చాల సన్నగా కనబడాలంట. ఆ సన్నివేశాలనే రెండో షెడ్యూల్ లో ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో వినాయక్ బాడీని తగ్గించటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకుడుగా నరసింహారావు వ్యవహరించనున్నారట. ఈయన గతంలో శరభ అనే సినిమాని తీశారు.

సంబంధిత సమాచారం :

X
More