డబ్బులు వెనక్కి ఇచ్చేసిన వివిఆర్ నిర్మాత !

Published on Jan 23, 2019 8:47 am IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ ను తెచుకున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈచిత్రం ఓవర్సిస్ లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యింది. రామ్ చరణ్ నటించిన గతచిత్రం రంగస్థలం ఓవర్సిస్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి చరణ్ కు మంచి మార్కెట్ ను క్రియేట్ చేసింది.

దాంతో ఈ వినయ విధేయ రామ కు అక్కడ భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే సినిమా విడుదలయ్యాక పరిస్థితి తలకిందులు కావడంతో ఓవర్సిస్ డిస్ట్రిబ్యూటర్ కి చిత్ర నిర్మాత దానయ్య డివివి 50లక్షల వరకు వెనక్కు ఇచ్చేశారని టాక్. అలాగే మిగితా డిస్ట్రిబ్యూటర్ లతో దానయ్య చర్చలు జరుపుతున్నారని వారికీ కూడా నష్టపరిహారాన్ని చెల్లిస్తారని సమాచారం.

సంబంధిత సమాచారం :