వివిఆర్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు !

Published on Dec 26, 2018 2:25 pm IST

రంగస్థలం తరువాత రామ్ చరణ్ ప్రస్తుతం తన 12వ చిత్రం ‘వినయ విధేయ రామ’ లో నటిస్తున్నాడు. ఈచిత్రం యొక్క షూటింగ్ నేటితో పూర్తి కానుంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 27న యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరుగనుందని తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి మరియు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిలుగా రానున్నారు. ఇక అదే ఈవెంట్ లో ఈచిత్రం యొక్క ట్రైలర్ ను రాత్రి 9గంటలకు విడుదల చేయనున్నారు అలాగే ఈ చిత్రం యొక్క జూక్ బాక్స్ కూడా రేపు విడుదలకానుంది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ , స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రాన్ని దానయ్య డివివి నిర్మిస్తున్నారు. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 11న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :