విశాఖలో ఘనంగా WAPCON-2026.. ఆయుర్వేదంతోనే మహిళా సాధికారత

WAPCON-2026

విశాఖపట్నం వేదికగా జరిగిన ‘ఉమెన్ ఆయుర్వేద పరిషత్ కాన్ఫరెన్స్–2026’ (WAPCON-2026) దేశంలోనే తొలి జాతీయ మహిళా ఆయుర్వేద సదస్సుగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆయుష్ శాఖ సహకారంతో “స్వస్థ నారి – శశక్త భారత్” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల ఆరోగ్యం మెరుగుపడితేనే కుటుంబం, సమాజం, అంతిమంగా దేశం బలోపేతమవుతుందని నిపుణులు స్పష్టం చేశారు. మహిళలు ఎదుర్కొనే హార్మోన్ల సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి సవాళ్లను ఆయుర్వేదంతో ఎలా పరిష్కరించవచ్చనే అంశంపై ఇక్కడ ప్రధానంగా చర్చించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్‌ఫ్రా ఛైర్మన్ డాక్టర్ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యే హెర్బల్ ముడిసరుకులో 60 శాతానికి పైగా భారత్ నుంచే వెళ్తోందని ఆయన తెలిపారు. భారతీయ ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికత (AI), కొరియన్ ఇన్నోవేషన్లతో అనుసంధానించడం ద్వారా రాబోయే రోజుల్లో గ్లోబల్ బ్యూటీ ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాణిజ్య లాభాలతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కూడా సాధ్యమవుతుందని డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు.

Exit mobile version