బాలీవుడ్‌లో రిలీజ్ అయిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరెక్కించగా రణ్‌వీర్ సింగ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.1400 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ములేపింది.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ధురంధర్ : ది రివెంజ్’ రిలీజ్‌కు రెడీ అయింది. మార్చి 19, 2026న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ‘ధురంధర్’ చిత్రాన్ని తొలుత ఒక వెబ్ సిరీస్‌గా తెరకెక్కించాలని మేకర్స్ భావించారట. అందుకే ఇందులో చాప్టర్ వైజ్‌గా కథను నడిపించారని మేకర్స్ చెబుతున్నారు. కానీ, కథలోని అంశాలు పెరిగిపోవడం, యాక్షన్ స్కేల్ పెరగడం, స్క్రీన్ ప్లే కూడా మారిపోవడంతో దీనిని సినిమాగా మలిచారట.
అయితే, ఈ కథను వెబ్ సిరీస్‌గా మలిచేందుకు చాలా స్కో్ప్ ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో ‘ధురంధర్’ వెబ్ సిరీస్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా..? అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.


