ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని రికమెండ్ చేశారా?

Published on Feb 21, 2020 8:20 am IST

గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రం నుండి ఆయన వరుస విజయాలు అందుకుంటూ వస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియా లెవల్ కి చేరడం ఖాయం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం రావడం అంటే లాటరీ తగిలినట్టే. జయాపజయాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ చిత్రాలకు భారీ ప్రీ రిలీజ్ బిసినెస్ జరుగుతుంది. కాబట్టి ప్రొడ్యూసర్ ఎవరైనా పెట్టుబడికి రెట్టింపు రాబడి రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ లాభాల శాతం ఇంకా పెరుగుతుంది.

కాగా ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించారు. మే నెలలో షూటింగ్ మొదలుకానున్న ఈచిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐతే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు సోలోగా ఈ చిత్రాన్ని నిర్మిద్దాం అని అనుకున్నారట. ఐతే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ పై ఒత్తిడి తేవడంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ ని నిర్మాణ భాగస్వామిగా చేర్చుకున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం కొరకు ఎన్టీఆర్ పారితోషికం కూడా భారీగా ఉందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More