‘వుయ్ లవ్ వైజాగ్’లో రాక్ చేయనున్న శృతి హాసన్ బ్యాండ్.

‘వుయ్ లవ్ వైజాగ్’లో రాక్ చేయనున్న శృతి హాసన్ బ్యాండ్.

Published on Nov 6, 2014 1:56 AM IST

Sruthi-Hasan
నవంబర్ 30వ తేదిన తెలుగు చిత్ర పరిశ్రమ నిర్వహిస్తున్న ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ స్టార్ నైట్ కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ తన బ్యాండ్ తో కలసి రాకింగ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. తన అందమైన రూపం, నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ నటి, మంచి గాయని అనే విషయం తెలిసిందే. ఇటివల ‘రేసు గుర్రం’, ‘ఆగడు’ సినిమాలలో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. తన రాక్ బ్యాండ్ తో కలసి స్టార్ నైట్ ఈవెంట్ రోజున స్టేజిను రాక్ చేయనుంది. తనకు మంచి మనసు ఉందని నిరూపిస్తుంది.

‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ స్టార్ నైట్ ఈవెంట్ కోసం టాలీవుడ్ భారి ఎత్తున సన్నాహాలు చేస్తుంది. అగ్ర హీరోలు, హీరోయిన్లు, హాస్య నటులు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. తెర వెనుక దర్శకులు పని చేయనున్నారు. నవంబర్ 30న టాలీవుడ్ కి సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళ పరిశ్రమ నుండి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు.

శృతితో పాటు మరికొందరు స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ స్టార్ నైట్ లో ప్రేక్షకులను అలరించడం కోసం స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. వాటి వివరాలను ఎప్పటికప్పుడు 123తెలుగు.కామ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా అందిస్తాం. మరిన్ని వార్తల కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.

తాజా వార్తలు