ఇంతకు ముందెన్నడూ చూడని సన్నివేశాల్ని రూపొందించాం – వరుణ్ తేజ్
Published on Jun 12, 2018 8:34 am IST

యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పేస్ నేపథ్యంలో సాగే ఒక థ్రిల్లర్ ను చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిన్ననే చిత్ర యూనిట్ కీలకమైన 35 రోజుల షెడ్యూల్ ను ముగించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ షూట్ జరిగింది.

జీరో గ్రావిటీ వాతావరణంలో సన్నివేశాలని చిత్రీకరించడం జరిగింది. దీని గురించి వరుణ్ మాట్లాడుతూ ఇంతవరకు స్క్రీన్ మీద ఎన్నడూ చూడని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. వీటి కోసం క్రియేటివ్ గా, ఫిజికల్ గా ఎంతగానో కష్టపడ్డాం అన్నారు. ఈ షెడ్యూల్ కోసం విదేశీ టెక్నీషియన్లు కూడ పనిచేయడం జరిగింది. అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజీవ్, క్రిష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook