తెలుగు తెర పై నవ్వులు పూయించిన గొప్ప హాస్య నటుల్లో ప్రముఖంగా ప్రధమంగా చెప్పుకోవాల్సిన పేరు పద్మశ్రీ డా అల్లు రామలింగయ్య. ఆఖరి శ్వాస వరకు నటించాలని కోరుకున్న ఆయన, చివరి వరకు సినిమాల్లో నటిస్తూనే తెలుగు ప్రేక్షకులను అలరించారు. 2004వ సంవత్సరంలో జూలై 30వ తారీఖున అల్లు రామలింగయ్యగారు కన్నుమూశారు. కాగా అల్లు శిరీష్ తన తాతయ్యను గుర్తు చేస్తూ ట్వీట్ చేసారు
పద్మశ్రీ డా అల్లు రామలింగయ్య 1013 చిత్రాల్లో నటించిన నటుడు, స్వాతంత్ర్య సమరయోధుడే కాక హోమియోపతి వైద్యుడిగా కూడా సేవలు అందించిన గొప్ప వ్యక్తి. ఆయన ప్రతి ఒక్కరికి స్నేహితుడు. వీటన్నిటికీ మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేమంతా మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం తాతగారు అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేస్తూ.. అల్లు రామలింగయ్యగారి ఫోటోను కూడా జత చేశారు.
Actor in 1013 films, homeopathy doctor, freedom fighter and everybody's friend : Padmashri Dr Allu Ramalingayya (1922-2004). Thank you for everything, we will always remember you Tatagaru. #grandfather pic.twitter.com/ZU1GumueGe
— Allu Sirish (@AlluSirish) July 31, 2018


