‘ఈషా’ చిత్రాన్ని వారు చూడకపోవడమే బెటర్ – నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి

1 3

‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి హిట్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ఇప్పుడు ‘ఈషా’ అనే హారర్ థ్రిల్లర్‌ను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నారు. అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా మరికొందరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో, శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత దామోదర ప్రసాద్ ఈ సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు బన్నీవాస్, వంశీ నందిపాటిలు ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో గొప్పదని ఆయన అన్నారు. మంచి ప్లానింగ్, ప్యాషన్ ఉంటేనే సినిమా విజయవంతమవుతుందని, ఈషా ఆ కేటగిరీలోకి వస్తుందని పేర్కొన్నారు.

బన్నీవాస్ ఈ సినిమా చూసి తానే నాలుగు సార్లు భయపడ్డానని చెబుతూ.. కంటెంట్‌పై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వంశీ నందిపాటి కూడా సినిమా చూసిన తర్వాత ఆత్మలున్నాయని నమ్మానని సరదాగా చెప్పారు. దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాత్రం షూటింగ్ దశలోనే ఈ ప్రాజెక్ట్‌కి మంచి పాజిటివ్ ఎనర్జీ లభించిందని, అందరి సహకారంతో సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

Exit mobile version