ఇప్పుడు ఈ డైరెక్టర్ పరిస్థితి ఏమిటి ?

Hanu Raghavapudi

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందనిపించుకున్న.. సెకండ్ హాఫ్ పెద్దగా బాగాలేదనే టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేని పరిస్థితి. దాంతో హను రాఘవపూడి పై బాగా విమర్శలు వస్తున్నాయి.

కాగా ప్రస్తుతం హను తన తరువాత సినిమాని నేచురల్ స్టార్ నానితో చెయ్యాల్సి ఉంది. కానీ ఇప్పుడు హనుకి నాని ఛాన్స్ ఇవ్వడేమో అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రేమ కథా చిత్రాల దర్శకుడి పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

Exit mobile version