అక్షయ్ రాయబారం లారెన్స్ ని కూల్ చేసిందిగా…!

Published on Jun 2, 2019 11:00 pm IST

కాంచన హిందీ రీమేక్ “లక్ష్మీ బాంబ్” మూవీ విషయంలో దర్శకుడు లారెన్స్ కి నిర్మాతలకు మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది.కాంచన హిందీ రీమేక్‌ “లక్ష్మీ బాంబ్‌” కు తిరిగి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు రాఘవా లారెన్స్‌ పేర్కొన్నారు.

అక్షయ్ కుమార్ తో లారెన్స్ కలిసి దిగిన ఫొటోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. “మీరు కోరుకున్నట్లే లక్ష్మీ బాంబ్‌ ప్రాజెక్టుకు తిరిగి నేనే దర్శకత్వం వహిస్తున్నా.నా ఫీలింగ్స్‌ను అర్థం చేసుకుని, సమస్యను పరిష్కరించిన అక్షయ్‌ కుమార్‌ సర్‌కు ధన్యవాదాలు. నిర్మాత షబీనా ఖాన్‌కు కూడా కృతజ్ఞతలు. నాకు గౌరవం ఇచ్చిన మీ ఇద్దరికీ థాంక్స్‌. ఈ సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అక్షయ్‌ సర్‌ అని” తన ఫ్యాన్స్ ను,చిత్ర యూనిట్ ని ఉద్దేశించి లారెన్స్‌ మెసేజ్ పోస్ట్ చేశారు.

తనను సంప్రదించకుండా “లక్ష్మీ బాంబ్” ఫస్ట్ లుక్ ని నిర్మాతలు విడుదల చేయడంతో లారెన్స్ అవమానంగా భావించి ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు అప్పట్లో ప్రకటించాడు.

సంబంధిత సమాచారం :

More