రామ్ ‘రెడ్’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ !

Published on Nov 30, 2020 8:00 am IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ ‘రెడ్’ సినిమాని డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భారీ ఆఫర్లు ఇచ్చినా.. మేకర్స్ మాత్రం సంక్రాంతికి నేరుగా థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దాం అని వచ్చిన ఆఫర్స్ ను వదులుకున్నారు. ప్రస్తుతం థియేటర్లు కూడా తెరవడానికి రెడీ అవుతున్నారు కాబట్టి.. ఈ సినిమాని కూడా రిలీజ్ కి రెడీ చేస్తారేమో చూడాలి. అయితే ‘రెడ్’ పై మాత్రం ఇంకా క్లారిటీ లేకుండానే ఉంది. మరోపక్క రామ్ తన సినిమాని నేరుగా థియేటర్ లోనే రిలీజ్ చేయటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని వార్తలు అయితే గత కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి.

కాగా సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పై మంచి హైప్ ఉంది. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. ఇక ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలు, కరోనా మహమ్మారి దెబ్బకు గందరగోళంలో పడ్డాయి. కానీ మంచి అంచనాలు ఉన్న సినిమాల కోసం మాత్రం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెడ్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చివరకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More