
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ సినిమా పలు వివాదాలను ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి సౌత్ ఇండియన్ ప్రేక్షకులంతా ఈ సినిమా సీక్వెల్ ‘విశ్వరూపం 2’ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అనుకున్న టైం కంటే ఆలస్యమవుతోంది.
ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ కుమార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఈ సినిమాలో బాగా ఎక్కువగా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్న కారణంగా సినిమా విడుదల ఆలస్యం అవుతోందని’ తెలిపింది. అలాగే మాట్లాడుతూ ‘ఒక వార్ ఎపిసోడ్ లో బాంబ్ ని డిఫ్యూజ్ చేసే సీక్వెన్స్ మొత్తం అండర్ వాటర్ లో ఉంటుంది. చాలా బాగా వచ్చింది. స్కూబా డైవింగ్ ట్రైనింగ్ ఇచ్చి నా చేత రియల్ గా ఆ సీన్స్ చేయించిన టీంకి నా థాంక్స్ అని’ పూజ కుమార్ తెలిపింది.
కమల్ హాసన్ తో పాటు పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి దర్శకత్వ భాద్యతలు కూడా కమల్ హాసన్ తీసుకున్నారు.

