నార్త్ లో ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

నార్త్ లో ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Published on Jun 4, 2026 2:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పెద్ది” కోసం తెలిసిందే. చాలా నెలలు తర్వాత బహుశా ఈ ఏడాదిలోనే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన నోటెడ్ సినిమా కూడా ఇదే అని చెప్పొచ్చు. మేకర్స్ పాన్ ఇండియా మార్కెట్ నే దృష్టిలో పెట్టుకొని ప్రమోట్ చేసిన ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ లని అందుకుంది.

అయితే హిందీ విషయంలో మాత్రం అభిమానుల్లో కూడా కొంచెం మంచి హోప్స్ ఉన్నాయి. దీనితో నార్త్ మార్కెట్ లో పెద్ది పెర్ఫామెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. బాలీవుడ్ ట్రేడ్ పండితులు అయితే పెద్ది సినిమాకి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. అలాగే బుకింగ్స్ పరంగా కూడా పెద్ది ఓ మోస్తరుగా కూడా ఓకే అని చెప్పొచ్చు.

సినిమా గ్రాండ్ ఈవెంట్ చేసిన భోపాల్, ముంబై వంటి ప్రముఖ ప్రాంతాల్లో బుకింగ్స్ కనిపిస్తున్నాయి. సో సాలిడ్ మౌత్ టాక్ ఈ చిత్రానికి ఇప్పుడు బాగా అవసరం. తెలుగు స్టేట్స్ లో ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చేసింది. సోయి హిందీలో ఇవాళే రిలీజ్ కాబట్టి మార్నింగ్ షోస్ నుంచి ఏమన్నా పుంజుకుంటుందేమో చూడాలి.

తాజా వార్తలు