ఈ హీరోయిన్ పరిస్థితి ఏమిటో ?

Published on Apr 14, 2019 10:26 pm IST

జెర్సీ సినిమాలో నాని సరసన నటించి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతొంది కన్నడ బ్యూటీ ‘శ్రద్ధ శ్రీనాథ్’. కొన్ని సంవత్సరాలు పాటు హైదరాబాద్ లో పెరిగిన శ్రద్ధ.. ఇప్పటికే పలు కన్నడ మరియు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న ‘జెర్సీ’ సినిమాతో ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరి ఈ అమ్ముడు ఈ సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ సంపాధించుకుంటుందో.. లేదో.. మొత్తానికి ఈ హీరోయిన్ పరిస్థితి ఏమిటో ?చూడాలి. ఇక నాని గురించి ఓ రేంజ్ లో పోగిడేసింది, నాని సహజ నటుడని, ఎలాంటి సన్నివేశాన్ని అయినా ఆయన చాలా సింపుల్ వే లో చక్కని హావబావాలతో నటిస్తారని.. ఆయన పక్కన నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని శ్రద్ధ శ్రీనాథ్ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :