మరి ప్రభాస్ “సలార్” పరిస్థితి ఏమిటో.?

Published on Aug 24, 2021 9:01 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఏకకాలంలో రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” ఒకటి కాగా మరొకటి సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తెరకెక్కిస్తున్న కంప్లీట్ డిఫరెంట్ సినిమా “సలార్”. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూట్ ని జరుపుకుంటుంది.

అయితే ఇదిలా ఉండగా ఇటీవల ప్రశాంత్ నీల్ మరో భారీ పాన్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” వచ్చే ఏడాది ఏప్రిల్ 14 కి డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇక్కడే అసలు డౌట్ స్టార్ట్ అయ్యింది. ఇది వరకే అదే డేట్ కి సలార్ ఇదే చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు కేజీయఫ్ 2 ని లాక్ చెయ్యడంతో సలార్ వాయిదా పడ్డట్టే అని అంతా అనుకుంటున్నారు.

కానీ ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ రాకపోవడంతో సలార్ కొత్త డేట్ ఎప్పుడు అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఎలాగో సినిమా జెట్ స్పీడ్ లో షూట్ నడుస్తుంది. దీనితో త్వరగానే కంప్లీట్ అయ్యే సూచనలు ఉన్నాయి. మరి ఆ కొత్త డేట్ కాస్తా ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :