నారా రోహిత్ ‘అసుర’ కథేంటి..?

నారా రోహిత్ ‘అసుర’ కథేంటి..?

Published on Jan 13, 2015 11:42 PM IST

Asura-First-Look
వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడంలో.. సరికొత్త కేరక్టరైజేషన్లతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడంలో నారా రోహిత్, ఓ అడుగు ముందుంటారు. తాజాగా ఈ యువహీరో నటిస్తున్న సినిమా ‘అసుర’. ‘గుడ్ ఈజ్ బ్యాడ్’ అనేది కాప్షన్. నేడు ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదలయ్యింది. టైటిల్లో కొత్తదనంతో పాటు మోషన్ పోస్టర్ తో సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని రేపారు. ఈ సినిమాలో రోహిత్ జైలర్ గా నటించారు. మోషన్ పోస్టర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా కథేంటి..? అని అందరిలో ప్రశ్న మొదలయ్యింది. ఒక రాక్షసుడి పేరును హీరోకి పెట్టడమే ఆసక్తి కలగడానికి కారణం.

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, డిఫరెంట్ కథతో ‘అసుర’ సినిమా ఉంటుంది. నా కేరక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సాంగ్స్ షూటింగ్ బాలన్స్ ఉంది. కమర్షియల్ హంగులతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అని నారా రోహిత్ తెలిపారు.

కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.

తాజా వార్తలు