విజయ్ దేవరకొండ ఏం మాట్లాడతాడో ?

విజయ్ దేవరకొండ ఏం మాట్లాడతాడో ?

Published on Jul 7, 2019 12:24 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా, అలాగే జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను హీరోయిన్ గా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘దొరసాని’. పీరియాడిక్‌ డ్రామాగా జూలై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ పై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు కూడా మంచి రెస్సాన్స్‌ వచ్చింది. అయితే తన తమ్ముడు హీరోగా వస్తోన్న మొదటి సినిమా పై విజయ్‌ దేవరకొండ మాత్రం ఇంతవరకూ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా టీజర్‌, ట్రైలర్‌ లపై తన స్పందనను తెలియజేయలేదు.

కాగా ఈ రోజు జరగబోయే ‘దొరసాని’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కు రానున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి.. అలాగే తన తమ్ముడి గురించి అతని నటన గురించి ఏం మాట్లాడతాడో అని విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక విషాద ప్రేమ కథతో రానున్న ఈ సినిమాలో చిన్న దొరసానిగా టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న శివాత్మిక అద్భుతంగా నటించిందని.. తన ఫెర్పామెన్స్ తో.. సినిమాలోనే హైలెట్ కాబోతుందని ఫిల్మ్ వర్గాల టాక్. మరి శివాత్మిక ముందు ఆనంద్ దేవరకొండ ఎంతవరకూ ఎలివేట్ అవుతాడో చూడాలి.

ఇక వాస్తవిక సంఘటనల ఆధారంగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యాష్ రంగినేని, మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు