‘వరుణ్’కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో ?

Published on Jun 17, 2019 7:04 am IST

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించిన వ‌రుణ్ తేజ్‌ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో రూపొందుతోన్న `వాల్మీకి` చిత్రంలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ‘ఎఫ్‌2’తో మంచి హిట్ అందుకున్న వరుణ్ కెరీర్ కి ఈ చిత్రం చాలా ముఖ్యమైనది. మరి సక్సెస్ కోసం చాల గ్యాప్ తీసుకున్న హరీష్ శంకర్ వరుణ్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

ఎలాగూ హీరో బాడీ లాంగ్వేజ్‌ ను స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేస్తూ సినిమాను క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌ టైన‌ర్‌గా తెర‌కెక్కించ‌డంలో ‘హ‌రీష్ శంక‌ర్‌’ దిట్ట. అందుకే ఈ సినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌ పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

కాగా ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 6న గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More