“అర్జున్ రెడ్డి” డైరెక్టర్ ఛాయస్ ఇకపై టాలీవుడ్డా,బాలీవుడ్డా?

Published on Jun 23, 2019 1:58 pm IST

సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన “అర్జున్ రెడ్డి” తెలుగులో ఎంతటి సంచలన విజయం సాధించిందో,హిందీ రీమేక్ “కబీర్ సింగ్”కూడా బాలీవుడ్లో అద్భుత విజయం వైపుగా దూసుకుపోతోంది. షాహిద్ కపూర్ హీరోగా చేసిన “కబీర్ సింగ్” వసూళ్లు మొదటి రోజు కంటే రెండవ రోజు అత్యధికం కావడం ఇంకు నిదర్శనం. క్రిటిక్స్ నుండి ఈ చిత్రానికి మిక్స్డ్ స్పందన వచ్చినప్పటికీ యూత్ తో పాటు,మాస్ ప్రేక్షకులు ఈ మూవీని ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలుస్తుంది.
షాహిద్ కెరీర్ బెస్ట్ ఫిలిం మరియు బెస్ట్ యాక్టింగ్, బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన ఫిలిం గా “కబీర్ సింగ్” నిలిచిపోవడం ఖాయంగా కనబడుతుంది.

కబీర్ సింగ్ మూవీ తరువాత దర్శకుడు వంగా పాపులారిటీ బాలీవుడ్ లో బాగా పెరిగిపోయిందని తెలుస్తుంది.ఈ మూవీలో షాహిద్ కపూర్ నటనతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి డైరెక్షన్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. బాలీవుడ్ సినీ ప్రముఖులు చాలా మంది ఆయన దర్శకత్వ ప్రతిభను పొగుడుతూ ట్వీట్స్ చేశారు. ఈ విజయం తరువాత ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సందీప్ రెడ్డి తో మహేష్ ఓ మూవీ చేయనున్నారని ఎప్పటినుండో వార్తలు వస్తున్న నేపథ్యంలో వంగా తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తుంది. ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకుడిగా తెరకెక్కుతున్న “సరిలేరు నీకెవ్వరూ” మూవీ సంక్రాంతికి రానుంది, కాబట్టి మహేష్ మరో ఆరునెలలు కొత్త మూవీ చేసే పరిస్థితి లేదు. సందీప్ రెడ్డి వంగా మహేష్ కొరకు వేచిచుస్తాడా? మరో హీరోతో ఈ గ్యాప్లో కమిట్ అవుతారా తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More