ఈ సినిమాకు దేవి మళ్ళీ దెబ్బేయడు కదా..?

Published on Jun 1, 2019 4:00 am IST

సినిమా ప్రపంచంలో అది ఎంత గొప్ప సినిమా అయినా ఎంత గొప్ప నటులు నటించినా ఎంత పెద్ద బడ్జెట్ తో సినిమా తీసినా సరే ఆ సినిమాలో మ్యూజిక్ అనేది లేదు అంటే ఎంత మంది కష్టపడినా సరే అది బూడిదలో పోసిన పన్నీరే అని చెప్పాలి.ప్రతీ ఒక్క సన్నివేశంలోనూ నేపధ్య సంగీతం పాటలు కథానుసాసరం సాగే సంఘటనలకు తగ్గట్టుగా సంగీత దర్శకుడు ఇచ్చిన స్కోర్ ని బట్టే సినిమాను చూసే ప్రేక్షకుడు లీనం అవుతాడు.అక్కడ సంగీతం ఉంది అందువల్లే తాను అంత ప్రభావితం చెందుతున్నాను అన్నంత గొప్పగా సంగీతం ప్రేరేపిస్తుంది.

అంతెందుకు మాటలు లేని సినిమాగా అంత పేరు తెచ్చుకున్న”పుష్పక విమానం” లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం లేకపోతే అంత పెద్ద విజయం సాధించదేమో అని చెప్పినా పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు.ఎందుకంటే సంగీతానికి అంత పవర్ ఉంటుంది.ఇప్పుడు ఇదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కు సంబంధించి మహేష్ ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు.తాజాగా “మహర్షి”లో దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం ఆకట్టుకోలేదు.అలాగే పాటల విషయంలో కూడా కొన్ని తప్ప వారికి నిరాశే మిగిలింది.

ఇప్పుడు మళ్ళీ తాజాగా మహేష్ మరియు అనీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న “సరిలేరు నీకెవ్వరు” కూడా ఈ రోజే ప్రారంభం అయ్యింది.ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకునిగా దేవినే అనీల్ ఎంచుకున్నారు.దీనితో మహేష్ అభిమానులు కాస్త మంచి సంగీతం అందించాలని ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో మొర పెట్టులుంటున్నారు.ఈ సినిమాలో మహేష్ సరసన రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు, మహేష్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More