ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ యాస సంగతేంటి?

ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ యాస సంగతేంటి?

Published on May 24, 2020 6:44 PM IST


రాజమౌళి కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల కథకు ఫిక్షన్ జోడించి ఆర్ ఆర్ ఆర్ గా తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణా ప్రాంతానికి చెందిన కొమరం భీమ్, విశాఖ వేదికగా తెల్లవారిపై పోరాడిన అల్లూరి కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కథాంశం అని రాజమౌళి ఇప్పటికే చెప్పడం జరిగింది. కాగా ఎన్టీఆర్ కొమరం భీం రోల్ చేస్తుండగా ఆయన చేత తెలంగాణ యాసలో డైలాగ్స్ పలికించనున్నాడు రాజమౌళి. ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో ఆయన యాస ఎలా ఉండబోతుందో శాంపిల్ చూశాం.

మరి అల్లూరిగా చేస్తున్న చరణ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లూరి విశాఖ ప్రాంతానికి చెందినవాడు. అక్కడ ప్రాంత ప్రజలకు ప్రత్యేక యాస ఉంది. మరి ఎన్టీఆర్ తో తెలంగాణా డిలెక్ట్ ట్రై చేయించిన రాజమౌళి చరణ్ తో కూడా మన్యం ప్రజల భాషా మరియు యాసా శైలిని ట్రై చేస్తాడేమో చూడాలి. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక చిత్రాల షూటింగ్స్ కి అనుమతి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ షురూ చేసే ప్రణాళికలో రాజమౌళి ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు