కోబ్రా పెద్ద మోసగాడిలా ఉన్నాడు..?

Published on Feb 29, 2020 9:03 am IST

హీరో విక్రమ్ లోకయనాయకుడు కమల్ హాసన్ కి ఛాలెంజ్ విసురుతున్నాడు. ఆయనకు మించిన రీతిలో భిన్న అవతారాలలో కనిపిస్తున్నాడు. విక్రమ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో కోబ్రా అనే యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ లుక్ నిన్న విడుదల కాగా అందులో విక్రమ్ ఏడు రకాల భిన్న గెటప్స్ లో కనిపిస్తున్నాడు. సైంటిస్ట్, ప్రీస్ట్, పొలిటీషియన్ ఇలా అనేక రంగాలకు చెందిన వ్యక్తుల రూపంలో దర్శనం ఇచ్చాడు. ఐతే ఈ ఫస్ట్ లుక్ చూస్తే ఈ చిత్ర కథపై ఓ అనుమానం కలుగుతుంది.

విక్రమ్ ప్రత్యర్థులను బోల్తా కొట్టించడానికి వివిధ వేషాలలో వెళ్లి మాయ చేసే మోసగాడి పాత్ర చేస్తున్నాడనే అనుమానం కలుగుతుంది. ఏదిఏమైనా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లారు. కోబ్రా చిత్రంలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ రోల్ చేస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More