నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్న వరుస ప్రమాదాలు

Published on Jun 16, 2019 9:19 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ లో గాయాల పర్వం కొనసాగుతుంది. “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ లో మొదట చరణ్ ఆతదుపరి ఎన్టీఆర్ గాయాలపాలయ్యారు,తరువాత నాని ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ లో , గోపీచంద్ ‘చాణక్య’ మూవీ షూటింగ్ లో ప్రమాదాల బారినపడటం జరిగింది. ఇక మూడు రోజులుగా రోజుకొకరు చొప్పున నాగ శౌర్య,సందీప్ కిషన్,శర్వానంద్ వరుసగా పెద్ద ప్రమాదాలకు గురై అదృష్టవశాత్తు ప్రణాపాయం నుండి తప్పుకున్నారు. యాదృచ్చికమో, నిర్లక్ష్యమో తెలియదు కాని ఇలా వరుసగా యంగ్ హీరోలు ప్రమాదాలకు గురికావడం పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.

హీరోలు ఇలా గాయాలపాలై షూటింగ్ అర్థాంతరంగా మధ్యలో ఆగిపోవడంతో నిర్మాతలు తలలుపట్టుకొంటున్నారట. అనుకున్న సమయానికి షెడ్యూల్ ముగించకపోతే ఆర్థికంగా, నిర్వహణా పరంగా నిర్మాతలకు అనేక సమస్యలు ఎదురవుతాయి. మిగతా నటుల డేట్స్ విషయంలో సమస్యలు తలెత్తడం వలన అనుకున్న సమయానికి సినిమా విడుదల చేసే పరిస్థితి ఉండదు. రాజమౌళి లాంటి దర్శకుడే ఈ సమస్యవలన అనుకున్న సమయానికి మూవీని విడుదల చేయగలమా లేదా అని నిరవధికంగా షూటింగ్ కంప్లీట్ చేయాలనీ నిర్ణయించారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు గాయాలు కావడం నిర్మాతలకు పెద్ద సమస్యగా పరిణమిల్లింది.

సంబంధిత సమాచారం :

X
More