‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న అన్వేష్, కావ్య జంట

‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న అన్వేష్, కావ్య జంట

Published on Feb 8, 2026 7:00 PM IST

Untitled 6

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, సరికొత్త కథాంశంతో ‘వాట్స్ అప్ నరేష్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్, ‘కొత్తపోరడు’ ఫేమ్ అన్వేష్ మైఖేల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది.

ఎనిమిది కోట్ల కట్నం ఇస్తే ఎంతకాలమైనా ఎదురుచూస్తానని చెప్పే హీరో డైలాగ్ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ప్రేమ, కుటుంబ బంధాల నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతోంది. ‘లోకం తీరింతే.. నువ్వే మారాలంతే’ అంటూ సాగే పాట హీరో క్యారెక్టరైజేషన్‌ను ప్రతిబింబించేలా ఉంది.

సివివి సినిమా బ్యానర్‌పై భాగ్యలక్ష్మీ చింత నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) సందర్భంగా రెండో గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు