‘ధృవ’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడూ?
Published on Nov 7, 2016 6:26 pm IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ’ధృవ’ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పక్కాగా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరిదశకు చేరుకున్నాయి. ఇక ఈవెంట్ ఏదీ లేకుండానే నేరుగా ఈనెల 9న ఈ సినిమా ఆడియో మార్కెట్‌లోకి విడుదల కానుండగా, ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందనేది అభిమానులకు ఇంకా ప్రశ్నగానే మిగిలింది.

సాధారణంగా ఏ పెద్ద హీరో సినిమాకైనా భారీ ఎత్తున ఆడియో వేడుకను నిర్వహించి, అదే వేడుకలో ట్రైలర్ కూడా విడుదల చేస్తూంటారు. ఇప్పుడు ‘ధృవ’కి ఆడియో వేడుక లేకపోవడంతో నవంబర్ మూడో వారంలో ట్రైలర్‌ను కూడా నేరుగా ఆన్‌లైన్లో విడుదల చేయాలని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విడుదలకు వారం రోజుల ముందు ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేపట్టాలని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. స్టార్ కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.

 
Like us on Facebook