“అఖండ” ఫస్ట్ సింగిల్ పై క్లారిటీ ఎప్పుడో.?

Published on May 25, 2021 10:04 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” అనే సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో దీనిపై ఎనలేని అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఎప్పటి నుంచో అభిమానులు ఫస్ట్ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సాంగ్ వచ్చే మే 28న విడుదల కానుంది అన్ని స్ట్రాంగ్ బజ్ ఉంది. కానీ సమయం దగ్గరకి వస్తున్నా దానిపై మాత్రం ఇంకాఆ ఎలాంటి క్లారిటీ రాలేదు. దానితో ఈ సాంగ్ ఆన్ టైం కి వస్తుందా లేదా అని బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. అసలే ఫుల్ స్వింగ్ లో ఉన్న థమన్ ఇచ్చే బీట్ ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్నారు. మరి అదెప్పుడు వస్తుందో..

సంబంధిత సమాచారం :