తేజ, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం లాంచ్ అయ్యేది ఎప్పుడంటే !

తేజ, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం లాంచ్ అయ్యేది ఎప్పుడంటే !

Published on Jul 8, 2018 2:55 PM IST

Teja Bellamkonda

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రేపు రామానాయుడి స్టూడియోస్ లో లాంచ్ అవ్వబోతుంది.

తేజా దర్శకత్వ శైలిలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. మంచి భావోద్వేగ సన్నివేశాలతో పాటు ప్రధానంగా వినోదాత్మకంగా ఉంటుందట. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో కొత్తగా కనిపించడంతో పాటు అతని సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సోనూసూద్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు