నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చిత్రం ఫస్ట్ లుక్ ను హీరో నితిన్ చేతుల మీదుగా నంవబర్ 4వ తేదీన విడుదల అవ్వనుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
కాగా ఈ చిత్రాన్ని ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో నవీన్ నేని, పూజిత పొన్నాడా, మహాత్ మరియు పంకజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ముఖ్యంగా చిత్రంలోని హాస్యం ప్రేక్షకులను బాగా అలరిస్తోంది చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.
ఇక రాయ్ లక్ష్మీ, చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలో, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో రెండు సూపర్ హిట్ ప్రత్యేక పాటల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.


