మెగా బ్యూటీ కామెడీ ఫిల్మ్ లోగో వచ్చేసింది !

మెగా బ్యూటీ కామెడీ ఫిల్మ్ లోగో వచ్చేసింది !

Published on Sep 20, 2018 6:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలో మరియు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో రెండు సూపర్ హిట్ ప్రత్యేక పాటల్లో నటించి మెగా బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ హీరోయిన్ రాయ్ లక్ష్మీ. తాజాగా ఇప్పుడు ఆమె ఓ కామెడీ చిత్రంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రగా రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చిత్రం నుండి లోగోను ద‌ర్శక నిర్మాత‌లు ఈ రోజు విడుద‌ల చేసారు. నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో నవీన్ నేని, పూజిత పొన్నాడా, మహాత్ మరియు పంకజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు