
మామూలుగా గత నాలుగైదు వారాల నుంచి ప్రతి వారం బాక్స్ ఆఫీసు వద్ద నాలుగైదు సినిమాలు విడుదలై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కానీ వీటిలో విజయాల కంటే ఫ్లాప్స్ ఏ ఎక్కువ ఉన్నాయి. ఎప్పటిలానే ఈ వారం కూడా అనగా నేడు రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆ రెండు సినిమాలలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన థ్రిల్లర్ ‘అనామిక’ ఒకటైతే, మారుతి దర్శకత్వం వహించిన ‘కొత్త జంట’ రెండవది.
నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘అనామిక’ లో వైభవ్, హర్షవర్ధన్ రాణే, పశుపతి కీలక పాత్రలు పోషించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. అల్లు శిరీష్, రెజీనా, మధురిమ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘కొత్త జంట’ కి జెబి సంగీతం అందించాడు.
రెగ్యులర్ రూటు మార్చి థ్రిల్లర్ సినిమా చేసిన శేఖర్ కమ్ములకి కచ్చితంగా ఇప్పుడు విజయం కావాలి. అలాగే మొదటి సినిమాతో నిరుత్సాహపరిచిన అల్లు శిరీష్ కి మరియు డైరెక్టర్ గా వరుసగా రెండు హిట్స్ అందుకున్న హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న మారుతుకి కూడా ఇప్పుడు విజయం కావాలి. ఈ తరుణంలో వస్తున్న ‘అనామిక’, ‘కొత్త జంట’ సినిమాల్లో ఈ వారం బాక్స్ ఆఫీసు విజేత ఎవరు? అనేది మరికొద్ది సేపట్లో తెలియనుంది. మీరు కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్స్ రూపంలో తెలపండి.

