బాలయ్య నుంచి వచ్చే ట్రీట్ ఏంటో మరి.?

Published on May 27, 2021 8:00 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “అఖండ”. బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ కోసం బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే అది ఈ మే 28 అంటే రేపే విడుదల అవుతుందని టాక్ వినిపించింది. కానీ టైం దగ్గరకి వస్తున్నా మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అలర్ట్స్ స్టార్ట్ కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్న స్ట్రాంగ్ బజ్ ప్రకారం ఇదే 28న బాలయ్య సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఏదోకటి ఉండటం ఖాయం అని తెలుస్తుంది. మరి అది అఖండ నుంచే ఉంటుందా లేక వేరే సినిమా పైనా అన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ సస్పెన్సుకి తెర పడాలి అంటే ఇంకొంత సమయం ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :