అరెస్ట్ నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆ తెలుగు నిర్మాత ఎవరు?

ticket rates

ప్రస్తుతం మన టాలీవుడ్ లో షాకింగ్ టాక్ వైరల్ అవుతుంది. ఏపీ సిఐడి వారు ఓ పాపులర్ నిర్మాతను అరెస్ట్ చేసేందుకు వెతుకులాట చేస్తున్నట్టుగా వస్తున్న రూమర్స్ ఇపుడు కలకలం రేపుతున్నాయి. అయితే అసలు అరెస్ట్ కి మెయిన్ కారణం ఏంటి అనేది కూడా రివీల్ కాలేదు కానీ ఇవ్వాలో రేపో అరెస్ట్ ఖాయం కానీ ప్రస్తుతం ఆ నిర్మాత దొరకకుండా తిరుగుతున్నాడు అన్నట్టుగా పుకార్లు ప్రస్తుతం షికార్లు చేసేస్తున్నాయి.

ఇదే అనుకుందో ఇందులో మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే సదరు నిర్మాత మన టాలీవుడ్ కి చేసిన ఓ స్టార్ హీరోకి కూడా బాగా సన్నిహితుడు అంటూ వినిపించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. దీనితో సోషల్ మీడియాలో ఆ స్టార్ హీరో ఎవరు? ఆ హీరోకి లింక్ ఉన్న నిర్మాత ఎవరు అంటూ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా మొదలైంది. మరి దీని వెనుక ఉన్న నిజం ఏంటి? ఆ హీరో ఎవరు? నిర్మాత ఎవరు అనేవి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టుగా ఈ రెండు రోజుల్లో రివీల్ అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version