మళయాళ బిగ్ బాస్ కు హోస్ట్ ఎవరో తెలుసా !

మళయాళ బిగ్ బాస్ కు హోస్ట్ ఎవరో తెలుసా !

Published on Jun 24, 2018 8:02 PM IST


హిందీ లో విజయం సాధించిన బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో 11 సీజన్లను పూర్తి చేసుకుంది . ఆ తరువాత గత ఏడాది ఈ షో ను తెలుగులో మరియు తమిళంలో ఇంట్రడ్యూస్ చేశారు . తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది . తమిళ్ లో కమల్ హాసన్ హోస్ట్ చేసిన ఈ షో అక్కడ కూడా మంచి రేటింగ్స్ ను సాధించింది దాంతో ప్రస్తుతం ఈ రెండు భాషాల్లో ఈ షో సెకండ్ సీజన్ జరుగుతుంది .

ఇక ఈ ఏడాది బిగ్ బాస్ షో ను మళయాళ ప్రేక్షకులకు కూడా పరచియం చేస్తున్నారు . మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మొదటి సీజన్ ను హోస్ట్ చేయనున్నారు ఈ ఆదివారం నుండి ఈ షో ప్రారంభం కానుంది 12 మంది పార్టిసిపేట్ చేయనున్న ఈషో 100 రోజుల పాటు జరుగనుంది . మరి ఈ షో అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందో చూడాలి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు